Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు రెండంతస్తులకు.. నిర్మాణాలు నాలుగంతస్తులు
- విధులు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్ పల్లి సర్కిల్లో అక్రమనిర్మాణాలను అడ్డుకోలేని అచేతన దీనావస్థలో సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆ సర్కిల్ పరిధిలోని కూకట్పల్లి, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్నాయని, అనుమతులు రెండంతస్తులు కానీ మూడు , నాలుగంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇలా నిర్మించడానికి కారణం, స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారుల అండ వారి ప్రోత్సహం వల్లనే అని వారంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజావసరాలైన మౌలిక వసతుల కల్పనలో సమస్యలు ఎదుర్కోక తప్పదని పలువురు వాపోతున్నారు. అంతే కాకుం డా అక్రమ నిర్మాణదారులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే భవన నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్మించకముందే నిర్మాణం బయట తెల్ల రంగు పూయించి లోపలపని చేసుకునేలా సలహాలు ఇస్తున్నారు అనే ఒక అపవాదు సైతం అధికారులు మూటగట్టుకున్నారని కొం దరు చెబుతున్నారు. ముడుపులు ముట్టడం వల్లనే ఇలాంటి చర్యలు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదులు అందిన ప్పటికి, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవాలి
గత నెలలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయి ము గ్గురు కార్మికులు మతి చెం దారు. ఇంత జరిగినా సర్కిల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణదా రులు నిర్మాణాలు చేపడుతు న్నారు. అయినా అధికారులు ఏ మాత్రం అడ్డుకొకపోవడం చూస్తుంటే కార్మికుల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తున్నారో తెలుస్తున్నది. ఇకనైనా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం అధికారులు ఆపాలి.
- బీఆర్ఎస్ నాయకుడు సిల్వర్ మనీష్