Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం షాపూర్ నగర్ హమాలి అడ్డ నుంచి షాపూర్ నగర్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి కె. బీరప్ప, జిల్లా కమిటీ సభ్యులు పసుల అంజయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో 73 షెడ్యూల్... కనీస వేతనాల జీవోలను సవరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతీ కార్మికుడికి, కార్మికురాలికి కనీస వేతనం రూ 26000 ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అడ్డాల మీద పనిచేసే అసంఘటిత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను ఉపసంహరించుకోవాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. వలస కార్మికులకు 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అమలు చేయాలని లేనిచో కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమాలకు పిలు పునిస్తామని హెచ్చరించారు. మార్చి 1వ తేదీన మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. దేవదానం,మల్లారెడ్డి , కర్ణాకర్, భాష, సాదుల్ పాల్గొన్నారు.