Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసు కెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నియోజకవర్గం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, సెక్రటరీలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి కార్యకర్తలు, బూత్ స్థాయి కన్వీనర్లతో ప్రతీ డివిజన్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వ ర్యంలో నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయల అభివద్ధిని చేశామని, దీనిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అం శంపై సూచనలు తెలియజేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేవలం 9 ఏండ్ల ల్లో సాధించామని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైద రాబాద్ మహానగరంలో మంత్రి కేటీఆర్ రోజూ వేలకోట్ల రూపాయల పరిశ్రమలను తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు సష్టిస్తున్నారని ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.