Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్, కల్యాణ్ నగర్ వెంచర్ త్రీ లో స్పీడ్ బ్రేకర్లను ఇష్టానుసారంగా, ఎక్కువ ఎత్తుతో, ఆరు అంగుళాల ఎత్తుతో వేయించారు. కనీసం అవగాహన లేకుండా అడ్డ మీద కూలీలతో తారు పోసి స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడు బేకర్లను స్ట్రీట్ లైట్లు లేని చీకటి ప్రదేశాల్లో వేశారు. స్ట్రీట్లై ట్లు లేని చోట స్పీడు బ్రేకర్లు వేయకూడదు అనే అవగాహన లేకుండా ఇష్టానుసారంగా కాలనీలోని అన్ని రోడ్లలో వేశారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు.. జీబ్రా లైన్స్ లేవు.. రాత్రిపూట అనేకమంది ద్విచక్ర వాహనదారులు తెలియక స్పీడ్‌గా రావడంతో అనేక ప్రమాదాలు జరిగాయి. అసలు స్పీడ్ బ్రేకర్లు వేయిం చింది అధికారులా? లేక అవగాహన లేని కాంట్రాక్టర్లా అనే అనుమానాలు వస్తున్నాయి. అడ్డా మీద కూలీలతో తారును కుప్పలుగా ఎత్తుగా పోసి వెళ్లారు. వెంటనే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వేసిన స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి, తొలగించి, రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు వేయాలనీ, స్పీడ్ బ్రేకర్ వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలనీ, స్పీడ్ బ్రేకర్లపై రేడియం స్టిక్కర్లు వేయాలని కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీ ప్రజలు కోరుతున్నారు. భార్గవి హాస్పటల్ లైన్లో మూడు స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. జైస్వాల్ హాస్పిటల్ ఎదుట మూడు స్పీడ్ బ్రేకర్లు ప్రమాద కరంగా ఉన్నవి. కార్లు, బస్సులు కూడా ఎగిరి పడుతూ ప్రయాణికులు భయపడుతున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది, డిప్యూటీ కమిషనర్ కాలనీలో వేసిన స్పీడ్ బ్రేకర్లను పరిశీలించి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని తొలగించి, రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే ప్రజలే వాటిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ద్విచక్ర వాహనదారులు అనేకమంది కింద పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.