Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రధాని మోడీ ఫాసిస్ట్ మతోన్మాద జాతీయవాదం దేశానికి ప్రమాదకరం అని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 19 వ జాతీయ మహాసభ ఆందోనళ వ్యక్తం చేసింది. భవి షత్తులో ఫార్వర్డ్ బ్లాక్ కలసివచ్చే వామపక్ష, ప్రజాస్వామ్య, ప్రగతిశీల పార్టీలతో కలసి మోడీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతరేకంగా భారీ ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని మహాసభ నిర్ణయించింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 19 వ జాతీయ మహాసభలు ముగిశాయి. ఈ మహాసభలలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నూతన జాతీయ కార్యదర్శి జి.దేవరాజన్ ఏకగ్రీవంగా ఎన్నికకాగా ఆయనతోపాటు పార్టీ జాతీయ చైర్మన్గా నరేన్ చట్టర్జి, వైస్ చైర్మన్గా పి.వి.కతిరవన్, కేంద్ర కార్యదర్శులుగా అసిమ్ సిన్హా, దాలిరం, జ్యోతి రంజన్ మహాపాత్ర, సంజరు భట్టాచార్య, బండా సురేందర్ రెడ్డి, అమరేష్ కుమార్, మోహన్ నంది, గోవింద్ రారు, జి.ఆర్. శివశంకర్, బివాస్ చక్రవర్తి లతో పాటు 65 మంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక య్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి జి.దేవరాజన్ మాట్లాడుతూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలు ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కమిటీ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిందని అభినందించారు. ఈ మహా సభలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 84 మంది ప్రతినిధులు దేశ సామజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థి తులపై చర్చించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మితవాద దాడికి తెరలేచిందనీ, మితవాద నయా-ఉదారవాద ఆర్థిక విధానాల కలయిక, హిందూత్వ ఎజెం డా దాడులు దేశ పురోగతికి ప్రమాదక రమనీ, ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దేశంలోని వామపక్ష, ప్రజా తంత్ర, లౌకిక శక్తులతో కలసి ఎదుర్కో వాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతర అబద్ధాలు, భారీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జాతీయ భద్రతా సమస్యను విరక్తంగా ఉపయోగించుకో వడాన్ని తిప్పికొట్టాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులని అదానీ, అంబానీ లాంటి మోసగాళ్లకు కారుచౌకగా అమ్ముకుంటుందని ఆరోపించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందన్నారు. సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. రోజురోజుకూ దూసుకుపోతున్న నిరుద్యోగ సమస్యను మోడీ గాలిలోకి వదలేసాడనీ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న మోడీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భయం, అభద్రతా వాతావరణం అన్నింటిలోనూ ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, విద్యావేత్తలు, రచయితలు ఉన్నారనీ, షెడ్యూ ల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మైనారిటీల కోసం ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలపై ఉద్దేశపూర్వ కంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఫాసిజం, ద్వేషం, విభజన ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతు న్న బీజేపీను ఓడించండనికి అన్ని వామపక్ష, ప్రజాస్వా మ్య, ప్రగతిశీల శక్తులు ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని బట్టబ యలు చేసేందుకు తమ శక్తియుక్తులను వినియోగించాల ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు లు ఆర్.వి.ప్రసాద్, ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, మహాసభల ఆహ్వాన సంఘం సభ్యులు సుందర రామ రాజు, కె.తేజదీప్ రెడ్డి, బి.రాములు యాదవ్, జి.వంశీధర్ రెడ్డి, కొమ్మూరి వెంకటేష్ యాదవ్, ఆవుల శ్రీకాంత్ యాదవ్, సయ్యిద్ తౌఫిక్ అలీ, తదితరులు పాల్గొన్నారు.