Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
- ఇందిరా పార్కు వద్ద మాజీ సైనికుల ధర్నా
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఉన్నా ఒక్క సైనికుడు కూడా లబ్ది పొందలేదనీ, దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆది వారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాలో ఈటల రాజేందర్ మాట్లాడారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం పోరాడుతున్న సైనికులకు రాష్ట్రంలో కనీసం సంక్షేమ పథకాలు కూడా అందడం లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో మాజీ సైనికులకు ఉద్యోగాలు అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల్లో వేరువేరు పద్ధతులు పాటించడం వల్ల మాజీ సైనికులు అర్హత సాధించలేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. పోటీ పరీక్షల్లో మాజీ సైనికులకు ఫీజు రాయితీ ఉన్న నోటిఫికేషన్లకు సాధారణ అభ్యర్థుల లాగే ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఉన్నా బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి ఒక్క మాజీ సైనికునికి కూడా లబ్ది పొందలేదన్నారు. ప్రభుత్వం రైతు వేదికలు, జిల్లాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మించిన విధంగా మాజీ సైనికులకు కూడా ప్రతి జిల్లాలో కమ్యూ నిటీ హాలు నిర్మించి రాష్ట్ర సైనిక బోర్డ్ డైరెక్టర్ బాధ్యత తీసుకోవాలని కోరారు. దేశ రక్షణలో అమరులైన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రతి జిల్లాలో ప్రభుత్వ అమరవీరుల స్థూపాన్ని నిర్మించి విజయ దివాస్ ఆర్మీ నేవీ ఐరిపోర్స్ లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని అధికారిక లాంచనాలతో జరిపేలా ఆదేశాలు జారీచేయాల ని కోరారు. ఈ ధర్నాలో తెలంగాణ మాజీ సైనిక్ ప్రెసి డెంట్ శ్యాం కుమార్, ఉపాధ్యక్షులు శాతిరి గంగరాజు, మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి, భూపాల్ పల్లి ప్రెసిడెంట్ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.