Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురుకుల పాఠశాలల్లో పౌష్టికాహారం అందించాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
- ఇందిరా పార్కు దర్నా చౌక్ వద్ద ధర్నా
నవతెలంగాణ-అడిక్‌మెట్
పెరిగిన ధరల ప్రకారం రాష్టంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాల కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ స భ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వంద లాదిమంది విద్యార్థులతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సంద్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఏండ్ల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్‌చార్జీలు, స్కాలర్ షిప్‌లనే నేటికీ కొనసాగిస్తున్నారన్నారు. ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగడంతో హాస్టల్ ''మెను'' పాటించడానికి డ బ్బులు సరిపోవడం లేదన్నారు. గుడ్లు, పండ్లు తగ్గించారని చెప్పారు హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిం చాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దుర్మార్గం అన్నారు. సంబంధిత మంత్రులు, కమిషనర్లు ఒక్క నాడు కూడా హాస్టళ్ళను సందర్శించి విద్యార్థుల సాదక బాధకాలు తెలుసుకోలేదన్నారు. పోరాడకపోతే హాస్టళ్ళ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్నారు. ఉద్యోగుల జీతాలు రెండు సార్లు పెంచారనీ, శాసనసభ్యులు, మంత్రుల జీతా లు మూడురెట్లు,వృద్ధాప్య ఫెన్షన్లను ఐదు రెట్లు పెంచారనీ, ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు, మెస్ చార్జీలు మాత్రం పెంచలేదన్నారు. రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాల లకు ఒక్క దానికి కూడా సొంత భవనం లేదన్నారు. కేటా యించిన ప్రభుత్వ స్థలాలను కూడా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అధికా రులు లంచాలు తిని దారదత్తం చేస్తున్నారన్నారు. బీసీ కా లేజీ హాస్టళ్లకు, గురుకుల పాటశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటే ష్, జీలపల్లి అంజి, వేముల రామకృష్ణ, రాజ్ కుమార్, గూజ సత్యం, అనంతయ్య, రాందేవ్ మోడీ, నిఖిల్, అరవింద్, అన్న పూర్ణ, కోటేశ్వరి, చందన, ఉమాదేవి, లక్ష్మి పాల్గొన్నారు.