Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదా గౌడ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
బీజేపీ నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగులు ఉన్మా దంతో కూడిన మాటలతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనీ, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుండ్రాతి శారదాగౌడ్ అన్నారు. ఆదివారం నారాయణగూడలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో శారదా గౌడ్ మాట్లా డుతూ కనీస ప్రజాస్వామ్య విలువలు పాటించకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో స్థానిక అధికార ప్రజా నాయకులపై ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ఆరో పించారు. ఎన్ని వేల స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహి ంచినా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. బీసీ సమాజం బీజేపీని క్షమించ దన్నారు. బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టడం తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, బీసీ రాజకీయ రిజర్వేషన్లు, బీసీ జనగణన, బీసీ బిల్లు, మహిళా బిల్లు వంటి వాటిపై మాట్లాడరనీ, కేవలం వాళ్ల రాజకీయ ప్రయోజనం తప్ప మీటింగుల్లో ఏమీ ఉండదన్నారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఏనాడూ మాట్లాడలేదన్నారు. అదానీ వ్యవహారంతో దేశాన్ని సత్తురోలు చేశారనీ, ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టతను దిగజార్చరన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందన్నారు. భేటీ పడావో భేటీ బచావో అనేది పై మాటలే తప్ప ఎక్కడా మహిళా సాధికారత, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ భద్రత మోడీ పాలనలో లేదన్నా రు. ప్రతి సామాజిక వర్గం అసంతృప్తితో బతుకుతుందన్నా రు. బీజేపీ ఎన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహించినా అది వ్యర్థమనీ, ఈ దేశ ప్రజలను మభ్యపెట్టలేరనీ, ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు గుర్తు పెట్టుకోవా లన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులలో అధికార స్థానిక ప్రజా నాయకులను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.