Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
భారత రాష్ట్ర సమితితోనే సంక్షేమం సాధ్యమవు తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాక డివిజన్ పరిధిలో ఏకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 500 మంది బీజేపీ నాయకులు గులాబీ గూటిలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పనిచేసే వారికే పట్టం కట్టాలనీ, ఎన్నికల ముందు వచ్చి దండాలు పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, చంద్రమోహన్, ఆర్కే బాబు, బి.నర్సింగ్ యాదవ్, ఈఎస్ ధనంజయ, కనివేట నర్సింగ్ రావు, శ్రీనివాస్, బాలరాజ్, భూపతి లక్ష్మణ్, మన్నె శ్రీనివాస్ యాదవ్, గాజుల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.