Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 24,053 మంది అభ్యర్థులకు నగరంలో పలు ప్రాంతాల్లో 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షను ఉదయం 9.45 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు పేపర్లుగా నిర్వహించారు. మొత్తం 24,056 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఉదయం 14,426 మంది (69 శాతం), మధ్యా హ్నం 14,150 మంది (69.90 శాతం) హాజరయ్యారు. అన్ని పరీక్షల కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు ఉదయం 9గంటల నుంచి లోపలికి అనుమ తించారు. అంతకుమందు సుమారు ఉదయం 7 గంటలకే అదనపు కలెక్టర్ పేపర్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకుని.. పోలీసుల బందోబస్తు మధ్య పేపర్లను ఆయా కేంద్రాలకు పంపించారు.