Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోల్కొండ జిల్లా నిజాం కాలేజీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కన్వినర్ నిజాం కాలేజ్ ప్రెసిడెంట్ శ్రావణ్ మాట్లా డుతూ ర్యాగింగ్, వేధింపులతో బలైన మెడికో ప్రీతీ ఆత్మహత్య ర్యాగింగ్ విష సంస్కతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నా రు. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ప్రగతిభవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జించే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దారావత్ ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. మెడికో ప్రీతీ ఆత్మహత్యకు కారకుడైన సైఫ్, కళాశాల అధికారులను కఠినంగా శిక్షించాల ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాగింగ్ విష సంస్కతిని నిషేధించేలా ప్రభు త్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనంత రం ర్యాగింగ్ విష సంస్కతిని నిరసిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణరు, రాష్ట్రకా ర్యవర్గసభ్యులు సాయికుమార్, పవన్, ఇబ్రహీం, ఆంజనేయులు, అక్షిత్, అన్వేష్, వినయ్, నరేందర్ పాల్గొన్నారు.