Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఐదేండ్ల బంపర్ టు బంపర్ వారెంటీతో బైక్‌వో ఎలక్ట్రికల్ వాహన సంస్థ తొలిసారిగా నగరంలోకి అడుగు పెడుతోంది. ఇండియా నెంబర్ 1 మల్టీ బ్రాండ్ సంస్థగా బైక్‌వో గుర్తింపు పొందింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 31లో కార్యాలయంలో సోమవారం బైక్‌వో సంస్థ సీఓఓ, సహ వ్యవస్థాపకులు విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ బైక్‌వో సంస్థ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. తమ వద్ద ఉన్న మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణా టక, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి నాణ్యమైన సేవలను అందించాలని ఉద్దేశంతోనే ఈ సరికొత్త వారెంటీతో అడుగుపెట్టినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రికల్ వాహ నాలకు సంఖ్య పెరిగిందనీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారుడికి మరింత భద్రత కల్పించేందుకు ఈ వారంటీని అందిస్తున్నామన్నారు. ఈ ఆఫర్‌ను పొందేందు కు, మీరు ఎంపిక చేసుకున్న బహుళ-బ్రాండ్ ఎలక్ట్రానిక్ వాహనాల శ్రేణిలో తక్కువ ధరలో, నిర్వహణ-రహిత ఈవీల నుంచి అత్యంత ఖరీదైన ఇ-బైక్‌ల వరకు ఎంచుకో వచ్చు అని తెలిపారు. ఈ బైక్ వో వాహనాలను నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకోవడంతో పాటు, అత్యుత్తమ ఆఫర్లు, సమీప ఛార్జింగ్ స్టేషన్లకు యాక్సెస్, ప్రత్యక్ష అనుభవాన్ని ఇక్కడ పొందవచ్చని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సరళ్ తల్వార్ (డైరెక్టర్ సేల్స్ అండ్ కో-ఫౌండర్, బైక్‌వో), మణిదీప్ (సహ వ్యవస్థాపకుడు, బైక్‌వో), ప్రముఖ మోడల్ పాల్గొన్నారు.