Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వారి సోలార్ రూఫ్ టాప్ ఎనర్జీ విజేత (సిల్వర్) కేటగిరీలో మొదటి అవార్డు లభించింది. ఈ అవార్డును ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన 3వ గ్రీన్ ఊర్జా అవార్డ్స్ అండ్ కాన్ఫెరెన్సెలో టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రతినిధికి అందజేశారు సంప్రదాయ వనరులైన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై భారం పడకుండా, సరఫరా నష్టాలు తగ్గించడం కోసం, రాష్ట్రంలో పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా సౌర ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగదారులను ప్రోత్సహించి భారీ స్థాయిలో సౌర ఆధారిత విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా సంస్థ చేసిన కృషికి గాను ఈ అవార్డు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సోలార్ పాలసీ 2015 వల్ల జూన్ 2014 రాష్ట్ర ఏర్పాటు నాటికి రాష్ట్రంలో 71 మెగా వాట్టుగా ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం ప్రస్తుతం 5748 మెగావాట్లకు చేరింది. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 46 మెగా వాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం ప్రస్తుతం 4025 మెగా వాట్లకు చేరింది. 0.45 మెగావాట్లు మాత్రమే ఉన్న సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ స్థాపిత సామర్ధ్యం ప్రస్తుతం 259 మెగా వాట్లకు చేరిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలి పారు. ఈ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, అన్ని వి ధాలుగా ఎల్లప్పుడూ దిశా నిర్దేశం చేస్తున్న టీఎస్ ట్రాన్స్‌కో, జెన్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభా కర్రావుకి రఘుమారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.