Authorization
Wed April 16, 2025 08:46:26 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న రోగులకు సంబంధించి చివరి ఒక గంట గోల్డెన్ అవర్ కీలకమని ఆలీవ్ సర్వోదయ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రేవంత్ జైస్వాల్ తెలిపారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో ఆదివారం ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ ఆస్పత్రి డైరెక్టర్లు డాక్టర్ మహ్మద్ ఆసిఫ్ షేక్, డాక్టర్ బన్సాల్, డాక్టర్ క్రితిక్ కులకర్ణిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాలు తదితర అత్యవసర సందర్భాల్లో అందుబాటులో క్రిటికల్ కేర్‌ను అందించే ఆస్పత్రులు లేకపోవడంతో విలువైన సమయం వృథా అయి రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ విభాగాలతో ఆసిఫ్‌నగర్‌లో 70 బెడ్స్‌తో ఆలీవ్ చవకగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.