Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
- మాస్టర్ అథ్లెట్లకు అభినందనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వయోభారాన్ని లెక్క చెయ్యకుండా, ముదిమి వయస్సులో కూడా క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి పతకాలు సాధించడం గర్వకారణమనీ, మీ విజయాలు భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయిని 'శాట్స్' చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన '4వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్'లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి, పతకాలు సాధించిన మాస్టర్ అథ్లెట్లను సోమ వారం ఎల్బీ స్టేడియం శాట్స్ కార్యాలయంలో క్రీడా విజేతలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ అథ్లెట్లు తమ వయస్సును లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. వీరి విజయాలు యువ క్రీడాకారులకు ఆదర్శనీయమన్నా రు. 4వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ నుండి 165 మంది అథ్లెట్లు పాల్గొ నగా వివిధ అంశాలలో మొత్తం 90 మెడల్స్ (25 గోల్డ్, 37 సిల్వర్, 28-బ్రాంజ్ పతకాలు) సాధించారు. మార్చ్ పాస్ట్‌లో ప్రధమ స్థానం, ఓవరల్ ఛాంపియన్ షిప్లో రెండవ స్థానం సంపాదించారు. శాట్స్ తరపున విజేతలందరికీ చైర్మెన్ ఆంజనేయగౌడ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి ప్రభుకుమార్ గౌడ్, కోశాధికారి డి. లక్ష్మీ, యు.కళ్యాణి, రాజరాజేశ్వరి, పద్మిణి, ఎం.ఆర్.పి బాబు, శ్రీహరి, లక్ష్మీసరళ పాల్గొన్నారు.