Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 7వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసచారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం కార్పొరేటర్ సిద్దాల బీరప్ప ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ 95000 మంజూరు అయ్యాయి. అందుకు సంబంధించిన ఎల్ఓసిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం బాధితుడి కొడుకు అఖిల్ ప్రసాద్‌కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మీర్ పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ : జల్పల్లి మున్సిపాల్టీ పరిధిలో ఉన్న శ్రీరామ కాలనీ 20వ వార్డులో తమ సమస్యలను పరిష్కారించాలని కోరు తూ అధ్యక్షులు నవాపేట ఆంజనే యులు ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసం లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుకు సీసీి రోడ్లు, తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులు, కరెంట్ స్తంభాలు. మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్టు తెలిపారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మంత్రి స్పందించినందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ కాలనీవాసులు మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.