Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ నాయకులు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
పెద్ద అంబర్ పేట మున్సిపాల్టీ పాపయ్య గూడ పేస్- 3లో భూ పోరాట క్షేత్రంలో పేదల దాహార్తి తీర్చేందుకు మంచినీటి దాహర్తి దాత కిరణ్ సహాయంతో సోమవారం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజ్ రవీంద్ర చారి , సీపీఐ(ఎం) కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి తెలిపారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్ద అంబర్ పేట మున్సిపాల్టీ కుంట్లూర్ గ్రామ రెవెన్యూ సర్వేనెం. 215 నుంచి 224 గల భూదాన్ భూమిలో గూడు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకోవడం జరిగిందని, గత 37 రోజులుగా ఇంటి స్థలాల కోసం అర్ధాకలితో భూ పోరా టం చేపడుతున్నారని తెలిపారు. ఇక్కడే నివాసం ఉంటూ వేలాదిగా పేదలు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చొర వ తీసుకొని మౌలిక వసతులు ఏర్పాటుకు కషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ దాతలు మానవీయ కోణంలో ముందుకొచ్చి పేదలకు మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు లు శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు అజ్మీర్ హరి సింగ్ నాయక్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేణు గోపాల చారి, బీఓసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, పార్టీ మండలకార్యవర్గ సభ్యులు దాదిమల్ల నారాయణ, చిలుకూరు పుల్లయ్య, ధూపం నిరంజన్, వట్టి నవనీత, కాటి అరుణా, ఎగిరేపల్లి దేవమ్మ, సుజాత ,చందన తదితరులు పాల్గొన్నారు.