Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకల్లో నటుడు సుమన్
నవతెలంగాణ-సరూర్‌నగర్
విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, తల్లిదండ్రులపై గౌరవం ఎంతో ముఖ్యం అని హీరో సుమన్ అన్నారు. నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు ఎస్ కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిలుగా హీరో సుమన్, రిటైర్డ్ జడ్జ్ బి మధు సూదన్, అబాకస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ రెడ్డి , మిస్సెస్ యూనివర్సిటీ 2022 సజనా, చైల్డ్ ఆర్టిస్ట్ సాయి హన్సిక, పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్‌లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమన్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ, తల్లిదండ్రులను గౌరవిం చడం, సొసైటీలో మానవత్వ విలువలను పెంపొందించుకోవడం కచ్చితంగా నేర్పించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రులతో పాటు టీచర్ల చేతిలో కూడా ఉందన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన అద్భుతమైన ప్రద ర్శనలతో వార్షికోత్సవ వేడుక కోలాహాలంగా జరిగింది.