Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలను కాలనీ వాసులు సద్విని యోగం చేసుకోవాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుమ ప్యారేజ్ నుంచి సికింద్రాబాద్ వరకు తిరిగే బస్సును సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎంతో కాలంగా కాలనీ వాసులకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలి పారు. ఈ విషయాన్ని మిధాని డిపో మేనేజర్ దష్టికి తీసుకు వెళ్లటంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు కాలనీ వాసుల సౌకర్యం కోసం నూతనంగా బస్సును ప్రారంభించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జగన్ నాయక్, రామచంద్రారెడ్డి, మహేష్, నారాయణ చారి, రాధాకష్ణ, రమణమూర్తి,రిటైర్ బ్యాంక్ మేనేజర్ డానియల్, అరుణ్, భవాని, చంద్రకళ, అనిత, సరోజ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.