Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో విద్యార్థులకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అవగాహన
- యానిమల్ సెంటర్కు కుక్కల తరలింపు
నవతెలంగాణ-ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయ త్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిల్లో వీధి కుక్కల బెడద నివారణకు అధికారులు నడుం బిగిం చారు. సోమవారం పలు కాలనీలో కుక్కలను పట్టు కొని యానిమల్ సెంటర్కు తరలించారు. పలు స్కూల్స్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుక్కలను రాళ్లతో కొట్టవద్దు అన్నారు. వేసవి కాలంలో కుక్కలకు తాగు నీరు అందుబాటులో పెట్టాలని సూచించారు. రోజుకు ఒక్క హయత్ నగర్ సర్కిల్ లోనే 800 ఫిర్యాదులు వస్తున్నాయని హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ పరిధిలో కుక్కల సమస్య నివారణ కోసం చేపడుతున్న చర్యలలో భాగంగా వెటర్నరీ విభాగము 7 డాగ్ స్క్వాడ్ టీమ్స్ ను ఏర్పాటుచేసింది. వీధి కుక్కల వలన ఇబ్బంది కలి గే ప్రదేశాలైనటువంటి మూసి పరివాహక ప్రాంతాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటుంది. అధిక జనసాంద్రత కలిగిన కొన్ని మురికివాడలు స్కూల్స్ ను సందర్శించి విద్యార్థుల కు అవగాహన కల్పి స్తున్నారు. కుటుంబ నియంత్రణ కానీ వీధి కుక్కలను గుర్తించి సెంటర్కు తరలిస్తున్నారు. ఇబ్బంది కలి గించి వెంబడించే వీధి కుక్కలను పట్టుకొని పత్తుల గూడాలోని యానిమల్ కేర్ సెంటర్కు తరలించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం, రేబిస్ వ్యాధి నివారణ టీకాలు చేయడం చేస్తున్నారు. కుక్కలకు చర్మవ్యాధి రాకుండా డివార్మింగ్ ఇంజక్ష న్లు ఇస్తున్నారు. ఐదు రోజుల తర్వాత ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే వదిలేస్తున్నారు. ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం జరిగే కార్యక్రమాల్లో సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, వెట ర్నరీ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్, శానిటేషన్ సిబ్బంది జడ్.పి. హెచ్.ఎస్ స్కూల్స్ ఉప్పల్, హయత్ నగర్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అయినటువంటి ఓల్డ్ హయత్ నగర్ విలేజ్, ప్రభాత్ నగర్ - సరూర్ నగర్, కాప్రా సర్కిల్లోని గ్రీన్ హిల్స్, మల్లాపూర్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ జాగ్రత్తలు తీసుకోవలసినదిగా సూచించారు.
(1) వీధి కుక్కలను చూసి పరిగెత్తడం చేయవద్దు. (2) నిద్రి స్తున్న కుక్కలను కొట్టవద్దు. (3) ఆహారం తింటున్న, నీరు తాగు తున్న కుక్కల జోలికి పోవద్దు. (4) పిల్లలతో ఉన్న తల్లి కుక్కలను తరిమి కొట్టడం వంటి పనులు చేయకూడదు.(5) వీధి కుక్కల తోక లాగడం, కట్టెలు రాళ్లతో కొట్టడం చేయవద్దు.(6)కుక్కల కండ్లలోకి దీర్ఘముగా చూడటం లాంటివి చేయవద్దు. (7) మిగిలిన ఆహార పదార్థాలు, మాంసపు వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ వేయవద్దు. (8) చెడిపోయిన మాంసపు ముక్కలు కాలనీలో వేస్తే వీధి కుక్కలు గుంపులుగా జమ అయ్యే అవకాశాలున్నాయి. సాధ్యమైనంత వరకు వీధి కుక్కలకు ఆహారం, తాగునీరు జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలలో పెట్టాలి. చెవి కత్తిరించనటువంటి, కుటుంబ నియం త్రణ కానటువంటి వీధి కుక్కలు మీ ప్రాంతంలో ఉంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్:040-21111111 కు ఫోన్ చేసి నెంబరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, కృష్ణయ్య, అరుణకుమారి, మారుతి దివాకర్, శంకర్, సురేందర్ రెడ్డిలు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్లు డాక్టర్ జేవ్యనాయక్, డాక్టర్ యాదగిరి శానిటేషన్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.