Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ హక్కులు-సవాళ్లు అంశంపై సదస్సు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-సంతోష్‌నగర్
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కులు-సవాళ్లు అంశంపై మంగళవారం హుసేని ఆలంలోని పాల్కి గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో సదస్సు జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.డి. అబ్బాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ బందాకరత్, పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంతోషనగ ర్లోని జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో, దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మతపరమైన అంశాలపై నడుస్తున్న రాజకీయ పరిణా మాలు భారత సమాజాన్ని విచ్ఛినంవైపు నెడుతున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సదస్సులో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలిన కోరారు.