Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ ఎండో అండ్ డయాబెటిక్ సెంటర్ వనస్థలిపురంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ సలహా మేరకు ఈ శిబిరం నందు ఉచితంగా కార్డియాలజీ కన్సల్టేషన్, 2డీ ఎకో, ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. 100 మంది ఈసీజీ, 2డీ ఎకో, కార్డియాలజీ కన్సల్టేషన్ సేవలు వినియోగించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్డియాలజీ డాక్టర్ జగదీష్ మేడ్ రెడ్డి, డాక్టర్ నరేందర్ రెడ్డిలు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.