Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి : ఏసీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
మైనర్లకు వాహనాలివ్వొద్దని బేగం పేట్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ జీ.శంకర్ రాజు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సోమవారం ఆసీఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీస ్‌స్టేషన్ పరిధిలోని 'ప్రియాంకా డిగ్రీ కాలేజీ'ల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలతోపాటు సైబర్ నేరాలపై అవగాహన కార్యాక్రమాన్ని నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్‌లో ఎదురయ్యే సమస్యలతోపాటు రాంగ్ రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. త్రిబుల్ రైడింగ్ మంచిది కాదన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కోరారు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ నుంచే రోడ్డు దాటాలని కోరారు. ఈ సమావేశంలో దాదాపు 300మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.