Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్
నవతెలంగాణ -సిటీబ్యూరో
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, జేఎన్టీయూ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వినయ బాబును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ముత్యాల రవీందర్ కోరారు. సోమవారం నగరంలోని పలు పాఠశాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడు తూ బడుగు బలహీనవర్గాల వారికి నాణ్యమైన విద్య అందించాలంటే, ఎప్పటికప్పుడు ఏర్పడ్డ ఉపాధ్యాయ ఖాళీలను పదోన్నతులు ఇచ్చి నింపాలని, ఉన్నోళ్లకైనా లేనోళ్లకైనా ప్రమాణాలతో కూడిన సమాన విద్యావకాశాలు కల్పించాలని, ఉద్యోగులందరికీ సకాలంలో మెడికల్ రీయంబర్స్మెంట్, అన్ని రకాల ఆర్థిక బకాయిలు చెల్లిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.రామానందయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిని సమస్యల గురించి మండలిలో ప్రశ్నించే వ్యక్తిని, ఉద్యమ భావాలు కలిగిన వ్యక్తిని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఉపాధ్యాయు లను కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు, ఉపాధ్యక్షులు సీతారామశాస్త్రి, కార్యదర్శులు సోమిరెడ్డి, అందేకర్ రవి, మండల బాధ్యులు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.