Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
భారత స్వాతంత్రోద్యమ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ కమలానగర్ ఆఫీసులో జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర రావు, రమణయ్య పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో అనేక పాయలుగా పోరాట పద్ధతులు జరిగాయి. శాంతియుత ఉద్యమాలతోపాటు, విప్లవ ఉద్యమాలు కూడా ఆంగ్లేయు లను గడగడలాడించాయి. రైతాంగ పోరాటాలు కార్మిక ఉద్యమాలు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగాను సంస్థానాధీశులకు వ్యతిరేకంగానూ పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.
హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ ఆధ్వర్యంలో గొప్ప గొప్ప పోరాటాలు జరిగాయి. దానిలో భగత్‌సింగ్ రాజ్‌గురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్‌లు వారితోపాటు శివవర్మ లాంటి విప్లవ యోధులు భాగస్వామ్యం అయ్యారన్నారు. అనంతరం సభికులందరూ చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విబి శంకర్రావు, శ్రీనివాస రావు, గౌసియా, శోభ, బసవ పున్నయ్య, శివరామకృష్ణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.