Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కట్టంగూరు హరీష్ రెడ్డి
నవతెలంగాణ-కాప్రా
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేయనున్నట్టు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కట్టంగూరు హరీష్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ 320సీ డిస్ట్రిక్ట్ గవర్నరుగా భారీ మెజార్టీతో ఎన్నికైన సందర్భంగా చర్లపల్లి పారిశ్రామికవాడలో అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు చర్లపల్లి బీఎన్ రెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన డయాలిసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్టు అయన తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగు లకు ఉపాధి కల్పించే విధంగా నిర్మించిన స్కిల్ డెవల ప్మెంట్ భవనమును అందుబాటులోకి తీసుకువచ్చి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృధి చేసేందుకు కృషి చేయనున్నట్లు అయన తెలిపారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నరుగా ఎన్నిక చేసిన ప్రతి ఒక్కరికీి ధన్యవాదాలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ 1గా కృష్ణ ప్రసాద్, వైస్ గవర్నర్ 2గా ఇన్నారెడ్డి, ముఖ్య సలహాదారులుగా భాస్కర్‌రెడ్డి, సూర్యనారాయణ, జీఏటీ వైస్ చైర్‌పర్సన్‌గా కొంపెల్ల కృష్ణ మూర్తి, కాబినెట్ సెక్రటరీగా డాక్టర్ లక్ష్మి మూర్తి, కాబినెట్ ట్రెజరరుగా హరికృష్ణ రెడ్డి, జాయింట్ సెక్రటరిగా ప్రభాకర రెడ్డి, జాయింట్ ట్రెజరరుగా సుధాకర్, చీఫ్ కోఆర్డినేటర్ గా శ్రీనివాస్ రెడ్డిలు ఎన్నికయ్యారు. సభ్యులుగా వై.సుధాకర్ రెడ్డి(వైఎస్ఆర్) అప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవయ్య, పైళ్ల మధుసూదన్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, సుందర్ రావు, కేసరి శ్రీనివాస్ రెడ్డి, సంపత్ గౌడ్, రూపా రెడ్డి, పజ్జురి పావని రెడ్డి, మంద సురేష్ కుమార్‌లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రమేష్ లక్ష్మణ్, బీవీ.రావులు వ్యవహరించారు. ఈ కార్యక్రంలో అతిథులు సునీల్ కుమార్, సీవీఎన్ రెడ్డి, బాబురావు, జగని భీమయ్య, విద్యాసాగర్ రెడ్డి, పీఏంసీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్. రావు, కేఎన్ రెడ్డి, దత్తు, నాగన్న తదితరులు పాల్గొన్నారు.