Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి కే కృష్ణా నాయక్
నవతెలంగాణ-కేపీహెచ్బి :డాక్టర్ ప్రీతి మృతికి కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి కే.కృష్ణా నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ కాకతీయ మెడికల్ డాక్టర్ వృత్తి విద్యలో పీజీ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేసి మృతికి కారకుడయ్యాడన్నారు. వేధింపులకు గురిచేసిన సైట్ పై అనేక మార్లు ప్రీతి యాజమాన్యంతో చెప్పిందని అక్కడ ప్రిన్సిపాల్ గాని, హెచ్ డి ఓ కానీ పట్టించుకోలేదని, వారిని కూడా విధుల నుంచి తప్పించాలన్నారు. ప్రితి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియ చెల్లించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో కులం పేరుతో మతాల పేరుతో ఇప్పటికీ దాడులు అణిచివేతలు జరుగుతున్నాయని, అగ్రవర్ణ దురహంకారం ఇప్పటికి గిరిజనుల కు దళితులకు వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మానవ మృగాల ను కఠినంగా శిక్షించాలని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పునరావృతం కాకూడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన అనేక మంది విద్యార్థినీయులను బాధ కలిగించిందని వేధింపులు ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు విద్యార్థులు ధైర్యంగా ఉండి ఒకటిగా ఎదుర్కొనాలని కోరారు. ప్రీతి కుటుంబానికి మేడ్చల్ మల్కాజ్గిరి గిరిజన సంఘం జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు బాబు నాయక్ సింగోటి సిఐటియు కూకట్ పల్లి నాయకులు మహేష్ రెడ్డి, భాస్కర్, ప్రభాకర్, సాయిరాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు
ొ మెడికో డాక్టర్ ప్రీతి మరణం బాధాకరం :
ొ ఆమె కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి
ొ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్
నవతెలంగాణ-మేడ్చల్
కేఎంసీ మేడికో విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం తీవ్ర బాధాక రమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీతి మరణం పట్ల ఎస్ఎఫ్ఐ మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా పక్షాన సంతాపని వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా తెలిపారు.ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి, ఆమె కుటుంబాని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. అలాగే నర్సంపేట జమున ఇంజినీరింగ్ కళాశాలలో ఫోటో మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రక్ష్షిత మరణం కూడా అత్యంత దారుణమైన ఘటనని అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు ర్యాగింగ్, వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయని, ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యం అన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు ప్రతి విద్యాసంస్థలో ఉండాలని 1997 ర్యాగింగ్ నిరోధక చట్టం,2009 సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ తెలియజేస్తున్నాయని తెలిపారు. వాటిని రాష్ట్రంలో అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రీతి ర్యాగింగ్ గురైన కళాశాలలో గతంలో ర్యాగింగ్ చేస్తున్నారంటు ప్రధానికి 20మంది విద్యార్ధులు ట్విట్ చేసిన కళాశాల యాజమాన్యం ర్యాగింగ్ కాదని కొట్టిపారేశారని ఆరోపించారు. మెడికల్ కళాశాలలో పెరుతున్న ర్యాగింగ్ సంస్కృతిని తరిమేందుకు ''యూజీసీ,ర్యాగింగ్ మార్గదర్శకాలు'' పాటించాలని యాంటి ర్యాగింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.