Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీల బడ్జెట్‌ను రూ.20వేల కోట్లకు పెంచాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
- ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్‌రావుకు వినతి
నవతెలంగాణ-అడిక్‌మెట్
బీసీ బడ్జెట్ రూ.20వేల కోట్లకు పెంచాలనీ, కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సంద్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బందు ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో బీసీ కార్పొ రేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.4 వేల కోట్లు, కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరిం చాలని కోరారు. పెరిగిన ధరల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలను నెలకు రూ.1500 నుంచి రూ.3వేలు, పాఠశాల హాస్టళ్లకు - గురుకుల పాఠశాల విద్యార్థుల ఆహారపు చార్జీలు 8 నుంచి 10వ తరగతి వారికి రూ.1100 నుంచి రూ.2500 కు, 3వ తరగతి నుంచి 7 తరగతి వారికి రూ.950 నుంచి రూ.2వేలకు పెంచాలన్నారు. విదేశ విద్య స్టైఫండ్ స్కీమ్ కింద అర్హులందరికీ స్టై ఫండు ఇవ్వడానికి దీని బడ్జెట్ రూ.60 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలన్నారు. 295 బీసీగురుకుల పాఠశాలలు అన్నీ అద్దె భవనాల్లో నడుస్తు న్నాయన్నారు. సరైన వసతి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీసీల న్యాయమైన డిమాం డ్లకు స్పందించిన మంత్రి బీసీల బడ్జెటును పెద్దయెత్తున పెంచు తామని హామీనిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి బీసీల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీనిచ్చారు అని తెలి పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, భూపేశ్ సాగర్, వేముల రామకృష్ణ, తదితర నాయకులు పాల్గొన్నారు.