Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ జి.శంకర్ రాజు
- సుజాత డిగ్రీ కాలేజీలో అవగాహన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన ఉండాలని ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ జి.శంకర్రాజు అన్నారు. బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇని స్టిట్యూట్ ఆధ్వర్యంలో సోమవారం గన్‌ఫౌండ్రి డివిజన ్లోని చాపల్ రోడ్డులో గల సుజాత డిగ్రీ కళాశాలలో విద్యా ర్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ ఫై అవగాహన కార్యక్ర మంను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం సరికా దన్నారు. మైనర్ డ్రైవింగ్, స్టాప్ లైన్, రాంగ్ రూట్, ట్రైబల్ రైడింగ్, ఫోన్ డ్రైవింగ్, జీబ్రా క్రాసింగ్ వాటిపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించా రు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ముఖ్యంగా ఆడపిల్లల కు సమాజంలో జరిగే మంచి, చెడుల పరిణామాలు వారి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, ఏకగ్రత, సమయం వృధా కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఎస్సై జ్యోతి, ఎన్.వెంకట ప్రసాద్, కళాశాల డైరెక్టర్ జయప్రకాష్. ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, వైస్ ప్రిన్సిపాల్ మనోహర్ సింగ్, ఎం.చక్రధర్, 150 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.