Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పి నేతాజీ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్ అన్నారు. ఇటీవ లే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జి.దేవరాజన్‌ను పార్టీ జాతీయ వైస్ చైర్మన్‌ను నూతనంగా ఎన్నికైన పి.వి.కతిరవన్ను ఏ.ఐ.ఎఫ్.బి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాములు యాదవ్ నాయకులు పం జాగుట్టలోని ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కార్యాలయంలో సోమవా రం కలసి శాలువా, ఫూలమాలలతో సన్మానించి అభినంద నలు తెలిపారు. ఈ సందర్బంగా దేవరాజన్ మాట్లాడు తూ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పై ఇప్పటికి జనాలపై ప్రభావం ఉందన్నారు. నేతాజీ దేశంలోని వాస్తవికతలకు పాతుకుపోయిన వామ పక్ష భావజాలానికి ప్రతిపాదకుడు అన్నారు. నేతాజీ జీవి తం పోరాటం గురించి యువతలో చాలా గౌరవం ఉంద న్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నేతాజీ అభిమానులు గుర్తించే ప్రత్యేక గుర్తింపు మనకు ఉంటుం దన్నారు. యువతను ఏ.ఐ.ఎఫ్.బి వైపు ఆకర్షించే ప్రయ త్నాలు చేస్తూ పార్టీ పటిష్టతతో పాటు తదుపరి తరం నాయకులను తీర్చి దిద్దడం కోసం బలమైన ప్రణాళికలు రూపొందించి చేసి అమలు చేయాలని అయన కోరారు. దేశాన్ని విడదీస్తున్న మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడేం దుకు అన్ని వర్గాల నూ ఏకం చేయాలనే నేతాజీ సిద్ధాం తాన్ని దేశమంతటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎఫ్.బి రంగారెడ్డి జిల్లా నాయకులు ఎం.నరసింహు లు, ఎండి.ఖాదర్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.