Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం అంబర్పేట డివిజన్ ప్రేమనగర్లో నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ స్థానిక బస్తీ ప్రజలతో కలిసి నూతన సీసీ రోడ్డు పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అవస రం ఉన్న చోట నూతన సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగా ప్రేమ్ నగర్లో నూతన సీసీ రోడ్డు పనులు చేపట్టినట్టు తెలిపారు. పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలనీ, స్థానిక బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, ఆమనూరి సతీష్, లింగరావు, రామారావు యాదవ్, మహేష్ ముదిరాజ్, రూబీ, లవంగు నాగరాజు, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.