Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లిహిల్స్
జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం తన కోటా కింద రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వడ లేదని సీపీఐ(ఎం) నాయకులు ప్రశ్నించారు. మార్చి నుంచి సబ్సిడీ బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) జూబ్లీహిల్స్ జోన్ నాయకులు బ్యానర్‌తో నిరసన తెలిపారు. కొత్తగా పెండ్లి చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడం లేదన్నారు. అసలు సైట్ పనిచేయటం లేదనీ, వెంటనే సైట్ ఓపెన్ చేసి, అర్హులైన కొత్తవారి కి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్పులు, చేర్పులు చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో సాయి శేషగిరిరావు, అశోక్, స్వామి, సికిందర్, బాలయ్య, భాగ్యరాజ్ పాల్గొన్నారు.