Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమ్ ఆద్మీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్
- డాక్టర్ ప్రీతి నాయక్‌కు కొవ్వొత్తులతో నివాళి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ర్యాగింగ్ భూతం కట్టడి చేయడంలో కాలేజీల యాజమాన్యాలు ఫుర్తిగా విఫలమయ్యాయనీ, ప్రభుత్వమే ర్యాగింగ్‌ను అట్టడుగు స్థాయి నుంచి నిర్మూలించడానికి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి నాయక్ మత్యువుతో పోరాడి కన్ను మూసిందనీ, సమాజం యువ వైద్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. సోమవారం హిమాయత్ నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి డాక్టర్ ప్రీతి నాయక్‌కు ఆమ్ ఆద్మీ నివాళులు అర్పించింది. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఇటీవల కాలేజీల్లో ర్యాగింగ్ వల్ల విద్యా ర్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ర్యాగింగ్ నిరోధక కమిటీలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ ఇన్స్పెక్టర్ను కూడా సభ్యునిగా చేర్చాలన్నారు. విద్యా ర్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే సంబంధిత కాలేజ్ నుంచి శాశ్వతంగా తొలిగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. ప్రీతి లాంటి ఘటనలు రాష్ట్రంలో మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాము గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆఫస, నేతలు టి.రాకేష్, గఫ్ఫార్, పరీక్షణ్, రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.