Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ బి.చంద్రకుమార్
నవతెలంగాణ - మీర్పేట్
ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి సమాజ మార్పు కోసం కషి చేయాలని హై కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సైన్స్ డే సందర్భంగా జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో బాలాపూర్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనతో సమాజంలో మూఢన మ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకున్న విద్యార్థులు వాటి గుట్టు విప్పి ప్రజలకు చెప్పాలని, మంచి పౌరులుగా సమాజం పట్ల క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా మెలాగాలన్నారు. సర్ సివి రామన్ ఇతర సైంటిస్టుల వలె కొత్త కొత్త అన్వేషణలు చేస్తూ సమాజం ప్రగతి వైపు నడిచే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. సైంటిస్ట్ జి రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు బట్టి చదువు కాకుండా శ్రద్ధగా అర్థం చేసుకుని సృజనాత్మకంగా ఆలోచిం చడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు యు. సాయి బాబా, మండల ప్రధాన కార్యదర్శి టీవీ జీకే రాజు, రిటైర్డ్ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు కిషోర్, ప్రధానోపాధ్యాయులు సరళ, రిటైర్డ్ హై స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర రాజు, సైన్స్ టీచర్ శంకరయ్య ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.