Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం టి.టి.డి తరహాలో జల ప్రసాదం ప్లాంట్ తమ స్వంత నిధులతో ఏర్పాటు చేయుటకు రాజు వేగేష ఫౌండేషన్ వారు అంగీకరించి సంస్థ చైర్మెన్ శ్రీ కోటి రాజు సతీమణి బాల సరస్వతి మంగళవారం దేవస్థానమునకు విచ్చేసి, స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరము ప్లాంటు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించిన స్థలంలో పూజ నిర్వహించారు. స్వామి వారికి ఇ-హుండీ ద్వారా విరాళములు అందించుటకు గాను దేవస్థానము పేరున యు.పి.ఐ. స్కానర్ ఏర్పాటు చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మెన్ మరియు ధర్మకర్తల ద్వారా ఆవిష్కరించారు.
భక్తులు యు.పి.ఐ ద్వారా నేరుగా తమ విరాళముల చెల్లింపులు చేయవచ్చును. ఆలయంలో అర్చకునిగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమా ప్రశాద్ వయసు రీత్యా మంగళవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మెన్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది, దేవాల యమునకు విచ్చేసిన భక్తులు, దాతలు, మాజీ ధర్మకర్తలు శ్రీ చంద్రమా ప్రసాద్ అర్చకుల వారిని ఘనంగా సన్మానించి వారి శేష జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస శర్మ, చైర్మెన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, చేగోని మల్లేష్ గౌడ్, చాతిరి అఖిల సాగర్, నర్రె శ్రీనివాస్, చలమల యాదిరెడ్డి, దేవరపల్లి వెంకట్ రెడ్డి, సి.హెచ్. అనిత, పద్మాల శంకర్, ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులు హాజరయ్యారు.