Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘరానా వ్యాపారుల గుట్టు రట్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-బోడుప్పల్
గడువు ముగిసిన వస్తువులను నగరం నుండి తీసుకొచ్చి వాటికి ఇంకో స్టిక్కర్ అతికించి వ్యాపార సముదా యాలకు తరలిస్తు ఘరానా మోసానికి పాల్పడు తున్న ఓ ముఠా గుట్టురట్టు చేసిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డి కాలనీలో హైదరాబాద్ బేగంజజార్కు చెందిన అంబాలాల్ జైన్ (58) శ్రీ హరి హంత్ లాల్ ఎంటర్ ప్రైజైస్ పేరిటా డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తున్నాడు.
అతను నగరంలోని బేగం బజార్లోని వివిధ షాపుల్లో గడువు ముగిసిన చాక్లెట్, తినుబండారాలు, బిస్కట్లు, శానిటరీ ప్యాడ్స్ ఇంకా రోజువారీగా ఇంట్లో ఉపయోగించే వస్తువులను తీసుకువచ్చి ఇక్కడ మరో లేబుల్స్ తయారు చేసి గడువు ముగిసిన వస్తువులపై అతికించి మరలా షాపు లకు తరలించి విక్రయిం చడం జరుగుతుంది. మంగళవారం నాడు విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటి పోలీసులు సదరు కార్యాలయంపై దాడి చేసి అందులో పనిచేసే నరేష్ బోరా, ఉమాకాంత్, జైన్ కమల్లను అదుపులోకి తీసుకున్నారు. సదరు దుకాణాన్ని సీజ్ చేసి లేబుల్స్ మరియు కంప్యూటర్ హర్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసిన వస్తువుల విలువ సుమారు రూ.6లక్షల వరకు ఉంటుందని తెలిపారు.