Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగోజి గూడ డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ శ్రీ చైతన్య హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించిన విద్యార్థు లకు ఆభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్ సయ్యద్ ఖాసిం అలీ. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ యం.రాజు సీసీఎంబి లో శాస్త్రవేత్తగా తన అనుభవాలను పంచుకొని నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జోనల్ ఏ.జి.ఎం. సతీష్ మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాలలో బాగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల సైన్స్ మోడల్స్, ఎగ్జిబిట్స్, ఎక్స్పిరిమెంట్స్ తల్లిదండ్రులను, ఉపాధ్యామాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్ ఎగ్జిక్యుటివ్ జీన్ప్రవీణ్, ఆర్.ఐ.లు రవీందర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఆహాడమిక్ కో-ఆర్టినేటర్ రఘువంశీతో పాటు వైస్‌ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, రాకడమిక్ డీన్ వెంకటరమణ, ప్రైమరీ ఇన్చార్చి లక్ష్మీ, ఇన్చార్జిలు సతీష్, సత్యనారాయణ, స్వాతి, కళ్యాణి, కల్పన, అనిత, కృష్ణారెడ్డి, మల్లీశ్వరి, వసుంధర, భారతి, లలిత, భవానీ, పి.కల్పన తదితరులు పాల్గొన్నారు.