Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయోలా మోడల్ స్కూల్ చైర్మెన్ వెంకట్రావు
నవతెలంగాణ-వనస్థలిపురం
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయటానికి సైన్స్ ఫెయిర్స్ ఎంత పడతాయని లయోలా మోడల్ స్కూల్ చైర్మెన్ వెంకటరావు తెలిపారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని లయోలా మోడల్ స్కూల్లో మంగళవారం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు చైర్మెన్ వెంకట్రావు మాట్లాడుతూ చదువు, ఆటపాటలతో పాటు విద్యార్థులు ఉన్నత శిఖరానికి అధిరోహించటానికి వారిలో ఉన్న నైపుణ్యతను వెలికితీయటానికి సైన్స్ ఫెయిర్స్ దోహద పడతాయి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కిడ్స్ను ఆయన నేరుగా సందర్శించి విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు, ఇన్చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.
శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో
వనస్థలిపురం పరిధిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో మంగళవారం ఉదయం నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటుచేసిన సైన్స్‌ఫేర్ ఎగ్జిబిషన్‌ని టీపీసీసీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డి, స్కూల్ యాజమాన్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్‌లను పరిశీలించి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సైన్స్‌ఫేర్ ల వల్ల విద్యార్థులకి మేదోశక్తి లభిస్తుందని, విద్యార్థులకు మరింత జ్ఞానం పెరుగుతుందని, భవిష్యత్తులో విద్యార్థులు మేధో సంపన్నులు కావడానికి ఇలాంటి సైన్సుఫే˜ర్లు దోహదపడతాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, డీన్ సృజన్, ఏవో మల్లేష్, ప్రైమరీ స్కూల్ ఇన్చార్జ్ ప్రసన్న, సి బ్యాచ్ ఇన్చార్జ్ రఘుపతి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి దుర్గ తదితరులు పాల్గొన్నారు.