Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ- మీర్పేట్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆర్కేపురం డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జిల్లెలగూడ ఎస్‌వైఆర్ గార్డెన్లో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు కలిసికట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్కేపురం డివిజన్లో ప్రతి కార్యకర్త్తరాబోయే రోజుల్లో కెసిఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిఇంటికి చేరే విధంగాప్రచారం నిర్వహించాలని, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందు ఉండి ఆదుకుం టానని అన్నారు. మతతత్వ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, మహేశ్వరం నియోజకవర్గం లోని ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పార్టీలోని నియోజకవర్గంలో స్థాయి నాయకులు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు ఏర్పరచుకొని తమ దృష్టికి తీసుకురావాలని, తద్వారా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి సహకరించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బేర బాలకిషన్, ఉపాధ్యక్షులు గంగాపురం లక్ష్మీ నరసింహ రెడ్డి, డివిజన్ పార్టీ అధ్యక్షులు నగేష్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రామ్ నరసింహగౌడ్, వెంకటేష్‌గౌడ్, గొడుగు శ్రీనివాస్ రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, కంచర్ల శేఖర్, దుబ్బాక శేఖర్, దేవేందర్, నియోజకవర్గ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఊర్మిళ రెడ్డి, శైలజ రెడ్డి, పుష్పలత రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.