Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మీర్పేట్ శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీహెచ్ఎస్ నాదర్గుల్ ప్రధానోపాధ్యా యుడు రాజారెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ పి.సురేష్ కుమార్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రికరించేలా విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దడమే తమ సంస్థ ధ్యేయం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం సతీష్, ఎగ్జిక్యూటివ్ డీన్ ప్రవీణ్, కో-ఆర్డినేటర్ రఘువంశీ, వైస్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, డీన్ నవీన్, ఏవో శ్రీకాంత్, సి బ్యాచ్ ఇన్చార్జి పెంటు సాహెబ్, టెన్త్ ఇన్చార్జిలు ప్రణరు పార్ద, దీప్తి, ప్రైమరీ ఇంచార్జి విజయలక్ష్మి, ప్రిప్రైమరీ ఇంచార్జి మంజు భార్గవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.