Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర ట్రాన్స్ కో ఏఈ అనిల్ కుమార్ రూ.12వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నా రు. వివరాలు ఇలా ఉన్నాయి. చీర్యాల గ్రామంలోని 60 కేవీ ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ మెటల్ కాంట్రాక్టుగా తీసు కున్న గుత్తేదారు బాల నరసింహ బిల్లు పెండింగ్లో ఉండటంతో ఆ బిల్లు మంజూరు చేయాలని గుత్తేదారు పలుమార్లు ట్రాన్సోకో ఏఈ అనిల్ కోరారు. తనకు లంచం ఇస్తేనే బిల్లు ఇస్తానని వేధింపులకు గురి చేయడంతో బాధి తుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కీసర మండల కేంద్రంలోని ఏఈ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితుడి నుంచి రూ.12వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఈ అనిల్ కుమార్ వద్ద రసాయనాలు పోసి ఉన్న రూ.12వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులపై ఏఈ అనిల్ కుమార్ ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అనిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.