Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఈ నెల 3వ తేదీన జరిగే డివిజన్ బూత్ కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కోరారు. మంగళవారం తన కార్యాలయంలో బూత్ కమిటీ ఇన్చార్జీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ లావణ్య జంగయ్య, నియోజకవర్గం మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ ఇజాజ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, సీనియర్ నాయకులు కర్రే జంగయ్య, మహిళా ప్రెసిడెంట్ లలిత, సెక్రెటరీ హరినాథ్, బుర్రి యాదగిరి, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఈ సమావేశంలో భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.