Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్. పంకజ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయంలో కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్.బి.నగర్, సరూర్ నగర్ అధికారులతో గురువారం స్వచ్ఛ సర్వెక్షన్ 2023, శానిటే షన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ పంకజం, ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్ మాట్లాడుతూ అధికారులకు పలు చూచనలు ఇచ్చారు. అధికారుల పని విధానాలపై మార్కులు కేటాయించారు. సాధించి మంచి ఫలితాలు కాలనీలో తీసుక రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్లు ఉమ ప్రకాష్, శేశిరేఖ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, డిప్యూ టీ కమిషనర్ కష్ణయ్య సరూర్నగర్, ఐదు సర్కిళ్ల అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, డి.ఈ.ఈ ఎస్.డబ్లు.యంలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ జవాన్లు, ఎన్విరాన్మెంటల్ స్పెక్యాలిస్ట్లు పాల్గొన్నారు.
1. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నగరంలో చేపట్టాల్సిన పనులపై సోమ భారత్, ప్రాజెక్ట్ మేనేజర్, ఎస్.డబ్లు.యం డ అస్.కి టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
2. ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
3. స్వచ్ఛ సర్వెక్షన్ కు మొత్తం 9500 మార్కులు కేటాయించారు. ఈ మార్కులను సాధించడం కోసం ప్రతి అధికారి గ్రౌండ్ లెవెల్ లో ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, మన నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కషి చేయాలని అధికారులను ఆదేశించారు.
జి.వి.పి (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్)
1. 100 రోజుల కార్య ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
2. ప్రతి 10 జి.వి.పి (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్) కు ఒక్క స్వేచ్ఛ సాతిలను నియమించాలని ఆదేశించారు.
స్వేచ్ఛ ఆటోల హాజరు ఎస్.ఎఫ్.ఎ వారీగా మెరుగుపరచాలని ఆదేశించారు.
పబ్లిక్ టాయిలెట్ పనితీరును ఎస్.ఎఫ్.ఎ వారీగా మెరుగుపరచాలని ఆదేశించారు.