Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మున్నూరు కాపు సంఘం మేడ్చల్ జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన పుప్పాల భాస్కర్ నియామకం చెల్లదని సంఘం కోఆర్డినేటర్స్ మామిళ్ల శ్రీనివాస్ పటేల్, నర్సింగరావు పటేల్, సింగం సత్తయ్య పటేల్ గంధం నాగేశ్వరావు పటేల్‌లు అన్నారు. గురువారం ఉప్పల్ ప్రెస్‌క్లబ్ లో వారు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షులు హనుమంతులు మేడ్చల్ జిల్లాలోని కోఆర్డినేటర్లు సంప్రదిం చకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలి పారు. కోఆర్డినేటర్లకు సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న సహించే ప్రసక్తి లేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఉపేక్షించబోమన్నారు.