Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలి వేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్శిహ్మ రెడ్డి అన్నారు. గురు వారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొ రషన్ పరిధిలో ఉన్న మామిడిపల్లి గ్రామంలో టిల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల సంక్షేమం కోసం బాట సారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ చల్ల బాల్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, నాయకులు ఆవుల రాజశేఖర్, పోచాల్ ముదిరాజ్, వై బాబు, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.