Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సుభాష్, కార్పొరేటర్ గీత
నవతెలంగాణ-హైదరాబాద్
ఉప్పల్ చౌరస్తాలో ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి భారీ నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే కార్పొరేటర్ మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ సిలిండర్ ధరల ను పెంచడం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఆనవాయితీ అయిందన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, వీబీ నరసింహ, డివిజన్ అధ్యక్షులు నర్సింగరావు, డాక్టర్ బి. వి చారి నాయకులు కోకొండ జగన్, సోమిరెడ్డి, అశోక్ చారి,ఉపేందర్ పాల్గొన్నారు.