Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్ నగర్
కరెంటు స్తంభాల దారి మధ్యలో ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి అసౌకర్యం కలగకుం డా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారు లకు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ సూచించారు. సరూర్నగర్ డివిజన్లోని చౌడి ప్రాంతంలో దారి మధ్యలో కరెంటు స్తంభాలు ఉండటం, ప్రజలు ఇబ్బంది పడడం చూసిన కార్పొరేటర్ గురువారం ఏఈ నరసింహ శెట్టితో సందర్శించి వీలై నంత త్వరలో వారికి సమస్య తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు సుద ర్శన్, దర్శన్,నిజాముద్దీన్, బీజేపీ నాయకులు ఆరుట్ల సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.