Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ. కోటి 50 లక్షలతో రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులకు శ్రీకారం
నవతెలంగాణ-బడంగ్పేట్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల ఆభివద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాల్టీ పరిధిలోని పహాడీ షరీఫ్ లో రోడ్డు విస్తరణ, మరమ్మత్తుల పనులకు శ్రీకారం చుట్టి అట్టి పనులను పర్యవేక్షించారు. అనంతరం పహాడీ షరీఫ్ లో 365 మెట్లు ఎక్కి బాబా షర్ఫుద్దీన్ దర్గాలో పూలు, చాద్దర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాబా షర్బద్దీన్ ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. చైర్మెన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది, వైస్ చైర్మెన్ పర్హనా నాజ్, కమిషనర్ వసంత, డీఈ వెంకన్న, రిప్రజెం ట్ వైస్ చైర్మెన్ యూసుఫ్ పటేల్,కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైసర్ భాం, కౌన్సిలర్లు దస్తగిర్, పుష్పమ్మ కొండల్ యాదవ్,శంషోద్దీన్,శంకర్,లక్ష్మినారాయణ, పమిద అప్జల్, ఇతర అధికారులు, పహడి షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, జనార్దన్,వివిధ కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.