Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ లేడీస్ హాస్టల్లో ఐఎఫ్టీయూ, పీఓడూబ్ల్యు కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిళా పోరాట దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లేడీస్ హాస్టల్ కాంప్లెక్స్ డైరెక్టర్ డాక్టర్ హిమబిందు, ఐఎస్టీయూ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ, హాస్టల్ సూపరింటెండెంట్ సంగీత, పీఓడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వరలక్ష్మి హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేక మంది మహిళల పోరాట ఫలితంగా సమాన పనికి సమాన వేతనం కోసం, పని స్థలాల్లో పని భారానికి వ్యతిరేకంగా, స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలనీ, ఐక్యతకు చిహ్నంగా జరుపుతారని పేర్కొన్నారు. అనేక మహిళా పోరాటాల ఫలితంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం అన్నారు. స్త్రీలు ఎదుర్కొం టున్న ఇతర అనేక అణచివేత సమస్యలపైన ఉద్యమిం చాలనీ, హక్కులని నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రభు త్వాలు మహిళల అభివృద్ధ్ధికి అనేక పథకాల అమలు చేస్తుందనీ, వాటిని సద్వినియోగించుకోవాలన్నారు. ఐఎస్టీ యూ అధ్యక్షులు ఎస్ఎల్.పద్మ మాట్లాడుతూ 112వ అంతర్జాతీయ శ్రామిక మహిళా వర్ధిల్లాలనీ, శ్రామిక మహిళల హక్కుల కోసం ఉద్యమించాలనీ, దేశంలో మైనా ర్టీలు, దళితులపై పురుషాధిపత్య భావజాలం పెంపొంది స్తున్న మనువాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. పని స్థలాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా స్రీ పురుష సమానత్వం కోసం ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, హాస్టల్ ఉద్యోగులు, కేర్ టేకర్స్, ఓయూ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు జయ, షహనాజ్, పద్మ, విజయ, శకుంతల, మెహర్, షాహిన్, అరుణ, లత, అనిత, వనజ, లక్ష్మి, మంగ, పుష్ప, భారతి, స్వప్న, హాజీ, సామ్రాజ్య, శ్యామల, లక్ష్మీదేవి పాల్గొన్నారు.