Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
సోలిస్ ట్రాక్టర్స్ అండ్ అగ్రికల్చరల్ మెషినరీ, నెదర్లా ండ్స్ యూరప్‌లోని ఐటీఎల్ ఫ్లాగ్షిప్ కంపెనీ, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కొనుగోలును ప్రకటించింది. ''నెదర్లాండ్స్‌కు చెందిన మా సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అండ్ అగ్రికల్చరల్ మెషినరీ కింద థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కొనుగోలును ప్రకటించినందుకు మేం సంతోషి స్తున్నాం. మరియు మేం రూ.200 కోట్లు డీల్ కుదిరింది. వీల్ లోడర్ తయారీలో ప్రముఖ బ్రాండ్, థాలర్ యూరోప్‌లో ప్రసిద్ధ వీల్ లోడర్ తయారీదారు, ఇది తదుపరి తరం సాంకేతికతలను అభివద్ధి చేయడంలో విశ్వసనీయత, నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుంచి అతిపెద్ద ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్ అయినందున, వీల్ లోడర్లు ఈయూ, యూఎస్ఏ మార్కెట్లలో వ్యవసాయం, పాడి పరిశ్రమ అండ్ నిర్మాణ పనుల కోసం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున మా పోర్ట్‌ఫోలియోకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ చర్య ఖచ్చితంగా ఇప్పటికే ఉన్న అగ్రి పరికరాల పోర్ట్‌ఫోలియోకు హై ఎండ్ సినర్జీని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో మా ఉనికిని బలోపేతం చేస్తుంది. అని తెలిపారు.